హరితహారం పథకం పై విచారణ జరిపించాలి

  రేవంత్  సర్కారుకు “ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గత సర్కారు పథకాల వైఫల్యాలపై రేవంత్ రెడ్డి సర్కారు దృష్టి సారించిన   నేపథ్యంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న “హరిత హారం పథకం పై” పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది.  వందల కోట్ల మొక్కలు  నాటామని చెప్పుకున్న బీ ఆర్ ఎస్ సర్కారు ఆ స్థాయిలో మొక్కలు నాటి సంరక్షించిన దాఖలా కనిపించడం లేదని,  హరిత హారంలో వేలాదిగా  పంపిణీ చేసిన మొక్కలు ఆయా పార్కుల్లో, చనిపోయాయని కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య శనివారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. గడ్డి మొక్కలు కూడా హరిత హారం మొక్కల లెక్కల్లో  చూపారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో హరితహారం పథకం నిజానిజాలు నిగ్గుతేల్చాలని రంగయ్య కోరారు. నిజానికి హరిత హారం లో చెప్పినట్లు కోట్లాది మొక్కలు నాటి ఉంటే పర్యావరణానికి మరింత మేలు జరిగుండేదని, కాని క్షేత్ర స్థాయిలో అది జరగలేదని ఆయన పేర్కొన్నారు. హరితహారం కోసం ఖర్చు చేసిన నిధులు,  జరిగిన ప్రయోజనం పై ఒక కమిటీ వేసి విచారణ చేపట్టాలని తన ప్రకటనలో స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.