కాగ్ రిపోర్టుపై సుప్రీం కోర్టుతో విచార‌ణ జ‌రిపించాలి..

-  టీపీఎస్ అధ్య‌క్షురాలు నీరా కిషోర్‌ డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాగ్ రిపోర్టుపై సుప్రీం కోర్టుతో విచార‌ణ జ‌రిపించాలని  టీపీఎస్ రాష్ట్ర అధ్య‌క్షురాలు నీరా కిషోర్‌ డిమాండ్ చెసారు.నేడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 2 ల‌క్ష‌ల 90వేల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌పై పలు అనుమానాలున్నాయ‌ని అన్నారు  .2017 నుంచి 2021 వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టి చేసిన ఖర్చులు స‌మాచారాన్ని ఇటీవ‌ల కంట్రోల‌ర్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఇచ్చిన‌ నివేదిక ప్ర‌కారం లెక్క‌లేనంత అవినీతి జ‌రిగిన‌ట్లు రుజువుల‌వుతున్నాయ‌ని ఆమె అన్నారు. దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్ లేదా విశ్రాంత జ‌డ్జిచే విచార‌ణ జ‌రిపించాల‌ని నీరా కిషోర్ డిమాండ్ చేశారు. ఈమేర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర రాజ‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ప్రజా  స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ శంక‌ర్ నారాయ‌ణ‌, స‌నాఉల్లాఖాన్‌, పార్టీ యువ నాయ‌కుడు మ‌న్మోహ‌న్‌రెడ్డి, రాష్ట్ర నేత‌లు విజ‌య్ కె కుమార్, అశోక్ కుమార్‌, బి. సతీష్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.