దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

- విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. తాజాగా ఢిల్లీ ముంబైలలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు(తనిఖీలు మాత్రమేనని వారు చెబుతున్నారు) చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పక్షాల నాయకులు కూడా తీవ్రంగా తప్పుబట్టారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ వ్యవహారంలో జేపీసీ ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం బీబీసీ వెనుకాల పడిందని కాంగ్రెస్ విమర్శించింది.ఈ చర్యను దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీగా అభివర్ణించింది. తొలుత బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. అది బ్యాన్ అయ్యింది. ఇప్పుడు బీబీసీపై ఐటీ సోదాలు జరిగాయి. అప్రకటిత ఎమర్జెన్సీకి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందిఅని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీబీసీపై దాడులను  కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన వారాల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడంపై బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ యూపీ ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీలు మండిపడ్డాయి.

Leave A Reply

Your email address will not be published.