కృష్ణా నదిలో బయటపడ్డ పురాతన విగ్రహాలు

.. చూసేందుకు ఎగబడ్డ జనం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పల్నాడు జిల్లాలో పురాతన దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి. అచ్చంపేట సమీపంలోని అంబడిపూడి దగ్గర కృష్ణా నదిలో పురాతన విగ్రహాలను స్థానికులు గుర్తించారు. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగంతో పాటుగా రెండు నందుల రాతి విగ్రహాలు ఉన్నాయి. కృష్ణానది ఎగువ భాగం నుంచి ఈ విగ్రహాలు కొట్టుకుని వచ్చాయా.. లేని పక్షంలో ఇసుక తవ్వకాల వల్ల నది అడుగున ఉన్న విగ్రహాలు బయటపడ్డాయా అనే విషయం తెలియాల్సి ఉంది.స్థానికులు ఈ విగ్రహాలను రక్షిత మంచినీటి పథకం కాలువ దగ్గరకు చేర్చారు.. ఈ విషయం తెలియడంతో విగ్రహాలను చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ విగ్రహాల విషయాన్ని స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. వారు విగ్రహాలను పరిశీలించారు. అధికారులు పురావస్తు శాఖ అధికారులకు విషయాన్ని చెప్పారు. వారి పరిశీలించి పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.గత నెలలో కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో విగ్రహాలు బయటపడ్డాయి. కృష్ణా నది ఒడ్డున కుప్పలుగా నాగదేవత విగ్రహాలు కనిపించాయి. ఈ విగ్రహాలను రాతితో చేశారు.. 50 వరకు ప్రతిమలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. కొన్ని విగ్రహాలు దెబ్బతిని ఉన్నాయి.. దీంతో ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తొలగిస్తే నదిలో కలిపే సంప్రదాయం ప్రకారం.. ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని చర్చించుకున్నారు. ఎవరో వ్యక్తులు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ కుప్పగా పోశారనే ప్రచారం జరిగింది. గతంలో కూడా పశ్చిమ డెల్టా ప్రధాన రెగ్యులేటర్ దగ్గర ఇలాగే నాగదేవత ప్రతిమలు ప్రత్యక్షం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ కృష్ణా నదిలోనే విగ్రహాలు బయటపడటం ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.