వీధి కుక్కల దాడిలో మరో బాలుడు బలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణలో వీధి కుక్కల దాడులకు చిన్నారులు బలైపోతూనే ఉన్నారు. విధి కుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు మృతి చెందుతుండగా.. మరికొంతమంది గాయాలతో బయటపడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడికి దిగాయి. ఈ దాడిలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. కుటుంబసభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్థానిక రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్ పార్క్ వద్ద ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేసినట్లు తెలుస్తోంది. చనిపోయిన బాలుడు యూపీకి చెందిన వలస కూలి కుమారుడు చోటు అని పోలీసులు గుర్తించారు.పోస్ట్‌మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఎంజీఎంకు పోలీసులు తరలించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యూపీ నుంచి బాలుడి కుటుంబ నిన్ననే రాగా.. ఉంగరాలు అమ్ముకోవడానికి ఖాజీపేట వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా హనుమకొండ జిల్లాలో వీధి కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందగా.. ఇప్పుడు కూడా అలాంటి ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. వీధి కుక్కలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు.బాలుడి మరణవార్తను తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. బీఆఎస్ నాయకురాలు గుండు సుధారాణి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కాగా గతంలో హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ.. నగరంలో వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకుంది. వీధి కుక్కలను పట్టుకుని ప్రత్యేక కేంద్రాలకు తరలించింది. మృతి చెందిన బాలుడి కుటుంబానికి జీహెచ్‌ఎంసీ ఆర్ధిక సహాయం ప్రకటించింది. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది

Leave A Reply

Your email address will not be published.