కవితకు మరో సారి సీబీఐ నోటీసులు.. అరెస్ట్ తప్పదా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం వదిలేలా కనిపించడం లేదు. ఆమెకు తాజాగా మరో నోటీసు ఇచ్చారు సీబీఐ అధికారులు. ఈ లిక్కర్ స్కాంలో కవితన ధ్వంసం చేసిన ఫోన్లు.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవి ఆ కేసులో సాక్ష్యాల కిందకు వస్తాయి. ఆమె వద్ద ఖచ్చితంగా ఉన్నాయని నిరూపణ చేసుకునే సీబీఐ ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.దీంతో వీటిని ఖచ్చితంగా కవిత ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అడిగినవన్నీ ఇచ్చేస్తే ఇక ఈ కేసులో చిక్కులు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే నిందితురాలిగా మార్చేసి.. సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసు కూడా పెట్టే ఛాన్స్ ఉంది. మళ్లీ విచారణ ఎప్పుడు అన్నది సీబీఐ తేదీ ఇవ్వలేదు. త్వరలోనే అని సమాచారం ఇచ్చారు.అయితే ఈసారి ఇంటికి వచ్చి విచారణ జరిపే అవకాశం లేదని.. ఢిల్లీ వచ్చి హాజరుకావాలని ఆదేశించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ అంశాలన్నింటినీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ కు వివరించారు. ఆ తర్వాత కవిత పేరుతో ఓ స్టేట్ మెంట్ విడుదల చేయాలని అనుకున్నారు.అయితే కేసీఆర్ కూతురు కేసు కావడం.. విషయం క్లిష్టంగా మారడం.. సీబీఐ మరో నోటీసు ఇవ్వడంతో ఈ వ్యవహారంలో తన వైపు నుంచి స్టేట్ మెంట్ రిలీజ్ చేయడాన్ని కవిత వాయిదా వేసుకున్నారు.ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎలాగైనా సరే కవిత పాత్రను నిరూపించాలని.. బుక్ చేయాలని సీబీఐ ఈడీ భావిస్తోంది. ప్రణాళికబద్దంగానే చేస్తున్నారన్న అభిప్రాయాలు ఇలాంటి కేసుల్లో వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు కవితకు ఈ కేసులో చిక్కులు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.