వెలుగులోకి మరో ప్రాణాంతక వైరస్.. లక్షణాలెంటీ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గత మూడేళ్ల క్రితం తొలి కరోనా పేరు ప్రపంచానికి పరిచయమైంది. తొలినాళ్లలో దీనిని చైనా లైట్ తీసుకుంది. వ్యూహన్ నగరంలో కరోనా తొలి కేసు మొదలైనప్పటికీ నుంచి ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయింది. ఈ వైరస్ చైనానే కాకుండా యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసింది. ఒకరి నుంచి మరొకరి కరోనా వైరస్ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు.ఈ మహమ్మారి సోకడంతో కోట్లాది మంది ప్రజలు మృత్యువాతపడగా మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పరిస్థితి మామూలుగా మారింది. అయితే ఇప్పుడు మరో కొత్త వైరస్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఎబోలాను పోలి ఉండే ప్రాణాంతకమైన మార్ బర్గ్ వైరస్ డిసీస్ (ఎంవీడీ)ని వైద్యులు గుర్తించారు. దీని తాలూకు తొలి కేసు గత వారం పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈక్వటోరియల్ గినియాలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.విపరీతమైన జ్వరం.. తీవ్రమైన తలనొప్పి.. ఆయాసం.. రక్తపు వాంతులు.. విరేచనాలు.. కండరాల నొప్పులు ఈ వైరస్ లక్షణాలు. ఈ వ్యాధిని తొలిసారిగా 1967లో గుర్తించారు. అప్పట్లో జర్మనీ.. సెర్బియాలో ఇది బాగా ప్రబలింది. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్ ద్వారా ఇది సోకినట్లు గుర్తించారు. గబ్బిలాలకు ఆవాసమైన గృహలు.. గనుల్లో చాలా కాలం గడిపితే ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది.ఎంవీడీ రక్తస్రావంతో కూడిన తీవ్ర జ్వరానికి దారితీస్తుంది. అప్పట్లో దీని బారిన పడిన వారిలో 88 శాతం మంది మృత్యువాత పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా సోకే ప్రమాదం ఉంది. తలనొప్పి.. జ్వరం.. ఆయాసంతో మొదలైన మూడో రోజు కల్లా పొత్తి కడుపులో నొప్పి.. విరేచనాల దాకా వెళ్తుంది. వారం రోజులకు రక్తపు వాంతులవుతాయి. ఆ తర్వాత నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.కాగా ఇప్పటి వరకు ఎంవీడీ వైరస్ కు మందుగానీ.. వ్యాక్సిన్ కానీ అందుబాటులో లేవు. పలు వ్యాక్సిన్లు ప్రయోగ దశలోనే ఉన్నాయి. దీంతో ఈ వైరస్ కు ప్రస్తుతానికైతే చికిత్స లేదని తెలుస్తోంది. కాగా తొలి దశలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టమని సమాచారం.కాగా ఇప్పటికే గినియాలోని కీటెం ప్రావిన్స్ లో దీని బారిన పడి 9 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ తాాజాగా వెల్లడించింది. 200 మందికి పైగా వైరస్ లక్షణాలు ఉన్నవారని క్వారంటైన్ చేశారు. దీంతో ఆ దేశానికి సరిహద్దు ఉన్న దేశాలు మందుస్తు చర్యలు తీసుకుంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.