ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్టు

-  పోలీసులు అదుపులో కెసిఆర్ కుమార్తె కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా డీల్ చేస్తూ.. దూకుడుగా వ్యవహరిస్తున్న సీబీఐ.. ఈడీలు తాజాగా మరింత వేగాన్ని పెంచాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురును అరెస్టు చేసింది సీబీఐ. తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్టు చేయటం రాజకీయంగా సంచలనంగా మారింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో సీఏ గోరంట్ల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా తమకు లభించిన ఆధారాల్ని పరిశీలించిన అధికారులు అతన్ని అరెస్టు చేశారు.ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించటం తెలిసిందే. ఈ సౌత్ గ్రూప్ విజయ్ నాయర్ కల్వకుంట్ల కవిత మాగుంట శ్రీనివాసరెడ్డి శరత్ చంద్రలు భాగమని చెప్పటం తెలిసిందే. ఈ కేసు విచారణ ఈ మధ్యన కాస్తంత మందగించినట్లుగా చెబుతున్నా.. అందులో నిజం లేదని.. తాజా పరిణామాలు చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఖాయమని స్పష్టం చేస్తున్నారు.ఈ కుంభకోణంలో భాగంగా సౌత్ గ్రూప్ (ఇందులో కవిత మాగుంట శ్రీనివాసరెడ్డి శరత్ చంద్ర)లు భాగస్వాములుగా చెబుతున్నారు. విజయ్ నాయర్ ఆదేశాలతో ఇండో స్పిరిట్ లో 65 శాతం కవిత..మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సౌత్ గ్రూప్ విజయ్ నాయరర్ ద్వారా ఆమ్ ఆద్మీ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లుగా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇక.. ఇండోస్పిరిట్ లో కవిత రూ.3.4 కోట్లు.. మాగుంట రూ.కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లుగా తెలుస్తోంది. కవిత తరఫున అరుణ్ పిళ్లై.. మాగుంట తరఫున రాహుల్ ఇండో స్పిరిట్ లో ప్రతినిధులుగా ఉన్నట్లుగా వెల్లడైంది. తాజా పరిణామం చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టు ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.