అధికార బీ ఆర్ ఎస్ పార్టీకి మరో షాక్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: అధికార బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యేరాష్ట్ర నాయకుడు నెమరుగొమ్ముల సుధాకర్ రావు బీఆర్ఎస్‌ను వీడనున్నారు. సుధాకర్ రావు గత కొద్దిరోజులుగా బీఆర్‌ఎస్‌‌లో అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు ఎమ్మెల్సీ ఇస్తామంటూ మాటల తప్పడంతో సీఎం కేసీఆర్ తీరుపై సుధాకర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించిన సుధాకర్‌రావు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మాజీ ఎమ్మెల్యే మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. దీంతో సుధాకర్ రావు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.కాగా.. ఇప్పటికే బీఆర్‌ఎస్‌‌లోని పలువురు అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. గద్వాల జడ్పీఛైర్ పర్సన్ తిరుపతయ్యమాజీ ఎమ్మెల్యే వేణుల వీరేశంసునీల్ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డితో ఠాక్రే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్‌లో చేరికపై ఇవాళ స్పష్టత రానుంది. కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలురంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. అలాగే ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదరరెడ్డిపట్నం మహేందర్ రెడ్డివికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిమాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిఎనుగు రవీందర్ రెడ్డిమాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.