టాలీవుడ్లో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిధి:
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కైకాల సత్యనారాయణ మరణం తర్వాత మరో మరణం సంభవించడం సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని మరువక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు.
సీనియర్ నటుడు చలపతిరావును సినిమా వాళ్లు బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇలా సీనియర్ నటులు కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు వరుసగా మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదంగా మారింది.