మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాల కేసులో మరో ట్విస్ట్‌

.. మరికొన్ని సార్లు దర్యాప్తు జరుపనున్న ఈడీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాల కేసులో మరో ట్విస్ట్‌ నెలకొంది. మల్లారెడ్డి ఇంట్లో సోదాల కేసుపై ఈడీకీ ఐటీ అధికారుల లేఖ రాశారు. మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు లేఖలో పేర్కొన్నారు. సోదాలకు సంబంధించిన పూర్తి నివేదికతో కి ఐటీ శాఖ లేఖ రాసింది. ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలను ఈడీకి తెలిపారు. మెడికల్ సీట్లుడొనేషన్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరపాలని కోరారు. ఈడీ విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఐటీ అధికారులు భావిస్తున్నారు.మల్లారెడ్డి ఆయన సోదరులుకుమారులుఅల్లుడుకు సంబంధించిన ఇళ్లుసంస్థల్లో ఐటీ అధికారులు మూడు రోజులుగా సోదాలు చేసిన విషయం తెలిసిందే. తనిఖీల్లో చాలా సమాచారం సేకరించారు. ఒక ల్యాప్‌టాప్ వ్యవహారంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అలాగే డ్యూటీలో ఉన్న అధికారులపై మంత్రి సీరియస్ కావడంవిధులకు ఆటంకం కలిగించడం విషయంలో మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాలేజీ ఫీజుల విషయంలోవ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రి ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మూడు రోజులపాటు చేసిన సోదాల్లో సేకరించిన సమాచారం.సీజ్ చేసిన డబ్బుడాక్యుమెంట్స్బ్యాంక్ లాకర్లు వీటన్నింటికి సంబంధించి అధికారులు ఈడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈడీ కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాల్లో భారీగా‌ నగదు సీజ్‌ చేశారు. రూ.18.50 కోట్లు, 15 కిలోల బంగారు ఆభరణాలు సీజ్‌ చేశారు. అలాగే మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించిన కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని బ్యాంక్‌ లాకర్లను ఐటీ అధికారులు ఓపెన్ చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.