షాపు ఏదైనా.. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: షాపు ఏదైనా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు తెరిచి ఉంచుకునేందుకు వీలుగా చట్టాన్ని మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే..ఇందుకోసం రూ.10వేల మొత్తాన్ని అదనంగా కట్టేస్తే సరిపోతుంది.అయితే.. దీనికి సంబంధించిన కొన్ని నిబంధనల(అన్నీ సుముచితమైనవే)ను పాటి స్తే సరిపోతుందని పేర్కొన్నారు. తాజాగా కార్మిక శాఖ కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో విడుదలైన జీవోను చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.24 గంటలు పని చేసే వ్యాపారానికి సంబంధించి పని చేసే సిబ్బందికి ఐడీ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలి. వారాంతపు సెలవు ఇవ్వాల్సిందే. వారంలో కచ్ఛితమైన పని గంటలు ఉండేలా చూడటం.. ఓవర్ టైంకు అదనపు జీతం ఇవ్వటం.. పండుగలు.. సెలవు దినాల్లో పని చేసిన వారికి అదనపు చెల్లింపులు జరపటం చేయాలి. లేదంటే కాంపెన్సేటరీ సెలవు ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు తగిన వేతనం తప్పనిసరి.రాత్రి షిఫ్టులో పని చేసే మహిళా ఉద్యోగుల నుంచి వారి ఇష్టపూర్వకంగానే అంగీకారం తీసుకోవాలి. రవాణా సదుపాయం కల్పించాలి. రికార్డుల్ని సరిగా నిర్వహించటంతో పాటు.. పోలీస్ యాక్టులోని నిబంధనల్ని తప్పనిసరిగా పాటిస్తే సరిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త నిబంధనలు తెచ్చినా.. హైదరాబాద్ మహానగరాన్ని మరో దిశగా తీసుకెళ్లేందుకు ఈ కొత్త ఆదేశాలు సాయం చేస్తాయని మాత్రం చెప్పక తప్పదు.

Leave A Reply

Your email address will not be published.