బీజేపీ అగ్రనేతలను ఎవరైనా.. ఎప్పుడైనా కలవొచ్చు

- కర్ణాటక ఎన్నికల ఫలితాలకు, తెలంగాణ ఎన్నికలకు సంబందం లేదు - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ లో అంతా బాగానే ఉందని.. జాతీయ నాయకులకు కలవటానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళితే తప్పేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అగ్రనేతలను ఎవరైనా.. ఎప్పుడైనా కలవొచ్చని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకుతెలంగాణ ఎన్నికలకు సంబంధమే ఉండదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. దేశమంతటా గెలిచినట్లు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.కర్నాటక ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులు పంపించారనికాంగ్రెస్ బలంగా ఉంటే.. దుబ్బాకహుజూరాబాద్మునుగోడులో ఆ పార్టీకి డిపాజిట్ కూడా ఎందుకు రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్రంతో పాటు.. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేపటానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందనిసొంత డప్పు కొట్టుకోవటానికి వేల కోట్ల ప్రజా ధనాన్ని సీఎం కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. 21 రోజుల ఉత్సవాల పేరుతో వందల కోట్లు యాడ్స్ రూపంలో సొంత వారికి అప్పజెబుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో 30 శాతం కమిషన్ ఉందని సీఎం స్వయంగా చెప్పారని అన్నారు.ఎమ్మెల్యే రాజసింగ్ ధర్మ రక్షకుడని.. ఆయన సస్పెన్షన్ విషయంలో త్వరలో మంచి నిర్ణయం వస్తుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలకు పక్కా ఇళ్ళు కట్టిస్తామనిపేదలు చదువుకునే విధంగా క్వాలిటీ విద్యతో పాటు.. మంచి వైద్యం అందిస్తామన్నారు. కేసీఆర్ హాయాంలో మద్యంపై రూ. 40 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కాగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. పది వేలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.