17 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజులు సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఈసారి ఏపీ అసెంబ్లీ సాగనున్నాయి. ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో జగన్‌కు సీటు ఎక్కడ కేటాయిస్తారోననే ఆసక్తి నెలకొంది. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.