ఏపీలో గంజాయి పంట మినహా సంక్షోభంలో మిగిలిన పంటలు

- జగన్ ప్రభుత్వం సాగును .. దానితో పాటు రైతును చంపేస్తున్నారు -  జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో రైతుల దుస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీలో గంజాయి పంట మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలో ఉన్నాయంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం సాగును .. దానితో పాటు రైతును చంపేశారన్నారు. ప్రతిపక్షాలపై కేసులు.. వనరుల దోపిడీ ఇదే జగన్ పాలన అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో రైతు వెంటిలేటర్ మీదున్నాడన్నారు. కర్నూల్‌లో పత్తిసీమలో వేరుశనగ రైతుగోదావరి జిల్లాల్లో ధాన్యం రైతు.. ఉత్తరాంధ్ర జీడి రైతు.. ఒక్కరైనా బాగున్నారా..అని చంద్రబాబు ప్రశ్నించారు. సీమలో హార్టికల్చర్.. కోస్తాలో ఆక్వా కల్చర్‌కు తమ హయాంలో ప్రాధాన్యం ఇచ్చామన్నారు.ఆక్వాహర్టికల్చర్ రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఏపీలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయి పంట అని పేర్కొన్నారు. నాలుగేళ్లల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చేతగాని ప్రభుత్వం ఉంటే రైతులు ఎలా నష్టపోతారోనడానికి నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనమన్నారు.ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా ఎక్కడా పంటలు వేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీలో భూముల ధరలు.. వ్యవసాయంపై కేసీఆర్ కామెంట్లు చేస్తున్నారన్నారు. ధాన్యం రైతుకి గిట్టుబాటు ధరలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు.ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ఈ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా చంపేసిందన్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారన్నారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదన్నారు. వరదల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని… రైతులను మంత్రి కార్మూరి ఎర్రిపప్ప అంటారని పేర్కొన్నారు.సీఎం జగన్ కనీసం ఒక్క రైతునైనా పరామర్శించారా..అని ప్రశ్నించారు. కౌలు రైతుల సమస్యలు చెప్పతరం కాదని చంద్రబాబు అన్నారు

Leave A Reply

Your email address will not be published.