బిసి లు రుణాలకు అర్హులు కారా?

- బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల సుదాకర్ ముదిరాజ్ 

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం అందించే రుణాలకు బిసి లు అర్హులు కారా? అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల సుదాకర్ ముదిరాజ్  ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుండి 2022 – 23 సంవత్సరం వరకు హైదరాబాద్ జిల్లాలో బీసీల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకుగాను ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ క్రింద యాభై వెయ్యిల రూపాయల కోసం 2047 మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు కేవలం 969 మందికి  రూపాయలు యాభై వేల చొప్పున మంజూరు చేశారన్నారు.4,84,50000 (నాలుగుకోట్ల ఎనభై నాలుగు లక్షల యైబై వెయ్యిలు) గడచిన ఎనిమిది సంవత్సరాలలో మంజూరు చేశారన్నారు.లక్ష నుండి రెండు లక్షల రూపాయల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 6362 గత ఎనిమిది సంవత్సరాల లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వారి సంఖ్య సున్నా అని తెలిపారు.రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ కొరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 7284, గడచిన ఎనిమిది సంవత్సరాల లో హైదరాబాదు జిల్లాల పరిధిలో మంజూరు చేసిన వారి సంఖ్య కుడా సున్నా అని అన్నారు.అత్యంత దయనీయమైన విషయం ఏంటంటే బీసీల పట్ల ప్రభుత్వ అత్యంత నిర్లక్ష్య వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ బీసీ సామాజిక వర్గాలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ రుణల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి రుణం ఇవ్వడానికి నియమ నిబంధనలు ప్రభుత్వం.ఇప్పటి వరకు తయారు చేయయాక పోవడం బీసీలను దగా చేయడమే నన్నారు. దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం మహిళలు ఐదు లక్షల 77 వేల మంది సబ్సిడీ రుణాల గురించి అప్లై చేసుకోవడం జరిగింది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు సబ్సిడీ రుణాలు ఇప్పటివరకు మహిళలకు అందలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించగం జరిగిందని పేర్కొన్నారు.ఆర్థిక ఇబ్బందులు తాల లేక ఎంతోమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం ఈ రకంగా అయినా రుణాలు కేటాయిస్తే ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని కుటుంబ పోషించుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు.చదువుకున్న వాళ్ళకి ఏదో ఒకచోట చిన్న ఉద్యోగమైన దొరుకుతుంది చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు రుణాలు ప్రభుత్వం కేటాయిస్తే అయినా వాళ్లకి ఏదో ఒక చిరు వ్యాపారం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటారని పేర్కొన్నారు.ఇప్పటికైనా మహిళల గురించి ఆలోచించి ప్రభుత్వం ముందుకు వచ్చి వెంటనే మహిళా రుణాలు కేటాయించాలని మత్త జయంతి ప్రభుత్వాన్నిడిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.