దేశీయ ఆయుధసంపత్తిపై ఆర్మీ చీఫ్‌ అచంచల విశ్వాసం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశీయ ఆయుధసంపత్తిపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌పాండే విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్‌ గాంధీనగర్‌లో జరుగుతున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో-2022లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు మిలటరీకి అండగా నిలిచాయని, ఈ ఆయుధ బలంతోనే భవిష్యత్తులో జరిగే యుద్ధంలో విజయం సాధిస్తామని స్పష్టంగా చెప్పగలమన్నారు. దేశీయ సాంకేతికతతో తయారు చేసిన ఆయుధాలు ఫార్వర్డ్‌ పోస్టుల్లో భాగా పని చేశాయని చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో లభించే ఇతర ఆయుధాల మాదిరిగానే ఇవి కూడా మెరుగైనవన్నారు.రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం తమకు గుణపాఠం చెప్పిందన్నారు. సాధ్యమైనంత వరకు ఆయుధ సరఫరా గొలుసుపై ఆధారపడకూదని, స్వావలంభన ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మేక్‌-1 ప్రాజెక్టుల్లో రెండు, మూడు ప్రాజెక్టులున్నాయని తెలిపారు. వీటిలో లైట్‌ ట్యాంకులు, సాయుధ వాహనాలు ఉన్నాయని, వీటికి ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూరుస్తుందని పేర్కొన్నారు. మేక్‌-2 కేటగిరిలో 43 ప్రాజెక్టులున్నాయని, వీటిలో 187 పరిశ్రమలు పాల్గొంటున్నాయన్నారు. దీని విలువ రూ.27వేలకోట్లు అని, ప్రధానంగా ఇప్రూవ్‌ ఇంటిలిజెన్స్‌, నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టుపై సైతం దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.