నైజర్ లో సైన్యం తిరుగుబాటు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ప‌శ్చిమ ఆఫ్రికా దేశ‌మైన నైజ‌ర్‌  లో సైన్యం తిరుగుబాటు ను ప్ర‌క‌టించింది. దేశాధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా తిరుగుబాటు చేప‌డుతున్న‌ట్లు జాతీయ ఛాన‌ల్‌లో సైన్యం వెల్ల‌డించింది. దేశ రాజ్యాంగాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అన్ని జాతీయ సంస్థ‌ల‌నుస‌రిహ‌ద్దుల్ని మూసివేస్తున్న‌ట్లు సైనికులు తెలిపారు. దేశాధ్య‌క్షుడు మొహ‌మ్మ‌ద్ బ‌జౌమ్ త‌మ ఆధీనంలో ఉన్న‌ట్లు సైనికులు వెల్ల‌డించారు.ప్రెసిడెన్షియ‌ల్ గార్డ్స్‌కు చెందిన ద‌ళాలు అధ్య‌క్ష భ‌వ‌నాన్ని సీజ్ చేశారు. రాజ‌ధాని నియామేలో ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అధ్య‌క్షుడు బ‌జౌమ్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయ‌నిఅందుకే ఆయ‌న్ను రిలీజ్ చేయ‌డం లేద‌ని సైనికులు తెలిపారు. అధ్య‌క్షుడు బ‌జౌమ్ అరెస్టును అమెరికాఐక్య‌రాజ్య‌స‌మితి ఖండించాయి.ప‌శ్చిమ ఆఫ్రికాలో ఇస్లామిక్ ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌డంలో బ‌జౌమ్ కీల‌క పాత్ర పోషించారు. ప‌శ్చిమ దేశాల‌కు ఆయ‌న మంచి స‌పోర్టు ఇచ్చారు. ఇటీవ‌ల నైజ‌ర్ పొర‌గు దేశాలైన మాలిబుర్కినా ఫాసోలో కూడా సైనిక తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.