తొలి వైద్యులుగా సమాజ ప్రగతిలో మంగలి వారి పాత్ర వెలకట్టలేనిది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సమాజ ప్రగతిలో తొలి ఆయుర్వేద వైద్యులుగా,మంగళ వాయిద్యకారులుగా ,క్షురక వృత్తి దారులుగా సమున్నతంగా సేవలు అందించిన మంగళ్లు / నాయీ బ్రాహ్మణులకు  ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని  తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పేర్కొన్నారు.ఆధునిక వైద్యం,సాంకేతికత అందుబాటులో లేని రోజులలో అనేక మొండి వ్యాధులకు చికిత్సలు అందించిన, గర్భిణులకు పురుడు పోసిన,మంగళ వాయిద్యాలతో సైతం రోగ నివారణ చేసిన తొలి తరం వైద్యులు, శాస్త్రవేత్తలు, సౌందర్య నిపుణులు నాయీ బ్రాహ్మణులే అని ఆయన గుర్తు చేశారు.మంగళవారం నాడు స్థానిక కొత్తపేట లో గల బాబూ జగజ్జీవనరాం భవనం లో తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం దశాబ్ది ఉత్సవ నాయీబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల బాల కిషన్,ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాసులు వ్యవహరించారు.ముఖ్య ,ఆత్మీయ అతిథులుగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు,ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రసంగిస్తూ—అన్ని వర్గాలను వివిధ సంక్షేమ పథకాలు అమలు ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్పగా చేయూత నందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని ఆయన అన్నారు.వృత్తిదారులను ఫించన్ల ద్వారా ఆదుకుంటున్న ప్రభుత్వం తమదేనని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు .డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ ..సెలూన్లకు ఉచితంగా250యూనిట్ల విద్యుత్తు, బిసి బంధు పథకం తో  ఒక లక్ష రూ ఆర్ధిక చేయూతనందించింది బారాసా ప్రభుత్వమే.

 వృత్తులు, వృత్తిదారులను అపారంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వమే.అని అన్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనం లో ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ దుగ్యాల అశోక్ కుమార్, రజక సంఘం నాయకుడు సత్యనారాయణ, మహిళా సంఘం అధ్యక్షురాలు అంజలి,ప్రతినిధులు అనిత,సుష్మ, గ్రేటర్ అధ్యక్షులు చింతల శ్రీనివాస్, గ్రేటర్ కార్యదర్శి విక్రమ్, ఉపాధ్యక్షులు ఎం.ప్రవీణ్ ,ప్రతినిధులు అంజయ్య,వెంకటేష్, నరసింహ,ఆర్ వినోద్ కుమార్, అశోక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయీబ్రాహ్మణ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.