తెలంగాణలో ఈ ఏడాది నవంబరు-డిసెంబరు మధ్య అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణలో ఈ ఏడాది నవంబరు-డిసెంబరు మధ్య అసెంబ్లీ ఎన్నికలు వున్నాయి. ఈ ఎన్నికలు చాలా హాట్ గురూ! అనే టైపు లో జరగనున్నాయి. దీనికి కారణం.. బీజేపీ కాంగ్రెస్ సహా మరికొన్ని చిన్నాచితకా పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. బీజేపీ అయితే.. ఏకంగా అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలను వాడుకునేందుకు రెడీ అవుతోంది. ఇక కాంగ్రెస్ పాదయాత్రలు జోడో యాత్రలు అంటూ హడావుడి చేస్తోంది. ఇంకో వైపు బీజేపీ నేతలు కూడా పాదయాత్రలు చేస్తున్నా రు.ఇక చిన్నా చితకా పార్టీలు కూడా కులాల పరంగా ఓట్లు చీల్చే కార్యక్రమానికి ఇప్పటికే రంగం రెడీ చేసుకున్నాయి.  అదేసమ యంలో టీడీపీ కూడా తన ప్రయత్నాలు ప్రారంభించింది. బీసీలకే సీట్లు అంటూ.. చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అంటే.. అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీకి ఇవన్నీ ప్రతికూలతలనే చెప్పాయి. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ… మంత్రి కేటీఆర్ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని.. మరోసారి అంటే ముచ్చటగా మూడో సారి కూడా తామే అధికారంలోకి వస్తామని ఆయన తేల్చిచెప్పారు.ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని   కేటీఆర్ అన్నారు. వ్యాపారులు పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతారణం ఉందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయన్నారు. అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అడోబ్ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్లను నగరంలో ఏర్పాటు చేశాయని ఆయన గుర్తుచేశారు. సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.‘‘2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ముందు కెళ్తున్నాం. హైదరాబాద్కు ఎన్నో అనుకూలతలు బలాలు ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి.  ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నాం.  లైఫ్ సైన్సెస్తో పాటు టెక్నాలజీ రంగానికీ హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారింది. వచ్చే ఎన్నికల్లోనూ మేమే గెలుస్తాం.. అధికారంలోకి వస్తాం ’’ అని కేటీఆర్ అన్నారు. మొత్తానికి తెలంగాణలో అధికార పార్టీ ధీమా అందరినీ ఆశ్చర్య పరుస్తుండడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.