మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్‌ రావుప్రశాంత్‌ రెడ్డికాంగ్రెస్‌ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్కఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ఈ భేటీలో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.ఈ సందర్భంగా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. అయితే పని దినాలు కాదుపని గంటలపై చూడాలని మంత్రి హరీశ్‌ రావు)అన్నారు. భారీ వర్షాలువరదలుప్రభుత్వ చర్యలపై చర్చించాలని నిర్ణయించారు. సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు పది బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. శుక్రవారం వరదలుశనివారం పలు బిల్లులపై చర్చించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.