గ్రహశకలం దారి మల్లింపు సక్సెస్

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించడమే టార్గెట్‌గా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ” నాసా” చేపట్టిన డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) ప్రయోగం సక్సెస్ అయ్యింది. గత నెల 26న డార్ట్ వ్యోమనౌక డౌమార్ఫస్ అనే గ్రహశకలాన్ని ఢీకొట్టింది. దీంతో అది తన కక్ష్యను మార్చుకున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తన డార్ట్ మిషన్ సక్సెస్ అయ్యింది. ఇటీవల నాసా వ్యోమనౌక ఒక ఉల్కను ఢీకొట్టింది. ఆ తర్వాత అది మరొక కక్ష్యలోకి వెళ్లడంలో నాసా చేపట్టిన ప్రయోగం విజయం సాధించింది. ‘సేవ్ ది వరల్డ్’ టెస్టింగ్‌ను ప్రకటించినప్పుడు ఏజెన్సీ ఈ సమాచారాన్ని అందించింది. తాము పంపిన వ్యోమనౌక ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిందని.. దాని కారణంగా అందులో భారీ బిలం ఉందని, దాని వ్యర్థాలు అంతరిక్షంలో వ్యాపించాయని నాసా తెలిపింది. ఇది వాహనంపై ఎంత ప్రభావం చూపిందో అంచనా వేయడానికి 520 అడుగుల పొడవున్న ఈ గ్రహశకలం ఎంత తేడా చేసిందో తెలుసుకోవడానికి.. డుబ్రిన్ సహాయంతో చాలా రోజుల పాటు పర్యవేక్షించారు నాసా పరిశోధకులు.

Leave A Reply

Your email address will not be published.