అమెరికాలో పర్యటనాలో సీపీఐ నారాయణకు చెదు అనుబవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రస్తుతం సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారాయణ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందని వార్తలు వస్తున్నాయి ఆయన క్యూబా రాజధాని హవానా విమానాశ్రయం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయానికి రాగా అక్కడ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారని తెలుస్తోంది.వాస్తవానికి సీపీఐ నారాయణ క్యూబా దేశంలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు హాజరవడానికి వెళ్ళారు. ఈ క్రమంలో క్యూబా దేశాధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్తో ఫొటో దిగారు. క్యూబా కమ్యూనిస్టు దేశమన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అమెరికాకు శత్రు దేశం కూడా. రష్యాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం.. క్యూబా.ఈ నేపథ్యంలో నారాయణ క్యూబా రాజధాని హవానా నుంచి అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో దిగారు. సిబ్బంది ఆయన ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసిన వారు సుమారు 69 గంటలపాటు నారాయణను అక్కడే ఆపేశారట.అనంతరం నారాయణకు సంబంధించిన పర్యటన పూర్తి వివరాలు తెలుసుకుని వదిలేశారు. స్వయంగా ఈ విషయాన్ని నారాయణే సోమవారం రాత్రి మీడియాకు పంపిన సందేశంలో వివరించారు. దీంతో నారాయణకు జరిగిన చేదు అనుభవం అందరికీ తెలిసింది. 

Leave A Reply

Your email address will not be published.