కొత్త బైక్ కొనాలనుకునే వారికీ బ్యాడ్ న్యూస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఏప్రిల్ 1 నుంచి బైక్స్, స్కూటర్ల ధరలు పెరగబోతున్నాయి. ఇప్పటికే దిగ్గట టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీని వల్ల కొత్తగా హీరో బైక్ లేదా స్కూటర్ కొనే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.

బైక్స్, స్కూటర్ల ధర దాదాపు 2 శాతం వరకు పెరుగుతుందని హీరో మోటొకార్ప్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ఓబీడీ 1కు బదిలీ కావడం ద్వారా వ్యయాలు పెరుగుతున్నాయని, అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొందని కంపెనీ వివరించింది. కాగా దేశంలో ఏప్రిల్ 1 నుంచి విక్రయించే అన్ని టూవీలర్లు ఓబీడీ 1 నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. అయితే ధరల పెంపు అనేది బైక్ , స్కూటర్ మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతుందని కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు నేపథ్యంలో కంపెనీ మాత్రం కస్టమర్లకు ఫైనాన్స్ విషయంలో భరోసా ఇస్తోంది. ఆకర్షణీయ ఫైనాన్స్ సదుపాయం అందిస్తామని పేర్కొంటోంది. అందువల్ల హీరో బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బెనిఫిట్ పొందొచ్చని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.