కడియం రాజు మరణంపట్ల బండి సంజయ్ దిగ్బ్రాంతి

-విద్యార్థి ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ కడియం రాజు -సామాన్య దళిత కుటుంబంలో పుట్టి ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఎదిగిన రాజు -తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర -కడియం రాజు మ్రుతి విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: అఖిల భారత విద్యార్ధి పరిషత్ జాతీయ మాజీ కార్యదర్శి, ఉస్మానియా యూనివర్శిటీ లెక్చరర్ కడియం రాజు అకాల మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. కడియం రాజు విద్యార్ధి దశ నుండి జాతీయ భావాలు కలిగిన వ్యక్తి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ అన్నారు. రాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన కడియం రాజుకు చిన్నప్పటి నుండే జాతీయ విద్యా విధానం, జాతీయ భావాలపట్ల ఆకర్షితుడయ్యారు. చిన్నతనం నుండి ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్తానం మొదలుపెట్టి విద్యార్థి జాతీయ కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు.

విద్యార్థి ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కడియం రాజుకు ఉస్మానియా వర్శిటీలో ప్రత్యేక స్థానం ఉంది. విద్యార్థుల పక్షాన అనేక పోరాటాలు చేసి పలుమార్లు అరెస్టై, జైలుకు వెళ్లిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. కడియం రాజుకు విద్యా విధానంపట్ల ఉన్న ఆసక్తిని గమనించి కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంపై ఏర్పాటు చేసిన బోర్డులో సభ్యుడిగా నియమించింది.

బీజేపీ గెలుపు కోసం పలు ఎన్నికల్లో కడియం రాజు ఎంతగానో క్రుషి చేశారు. ఆయన మరణం విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటు. కడియం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాఅన్నారు.

Leave A Reply

Your email address will not be published.