నేటితో ముగియనున్న బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. నేడు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండగా ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానుండగా బహిరంగ సభలో పాల్గొననున్న కిషన్ రెడ్డి, కే. లక్ష్మణ్, తరుణ్ చుగ్ సహా ఇతర ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. లక్ష మంది జన సమీకరణతో బహిరంగ సభను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర నాయకత్వం ఐదు విడతల్లో కలిపి, నేటితో 120వ రోజుపూర్తి చేసుకోనున్న బండి సంజయ్ పాదయాత్ర. 56 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా కొనసాగిన పాదయాత్ర 1403 కిలోమీటర్ల మేర బండి నడిచారు. ఇవాళ్టి సభతో కలిపి మొత్తం 15 భారీ బహిరంగ సభలు, 50కి పైగా మినీ బహిరంగ సభలు నిర్వహించిన తెలంగాణ బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టడంలో విజయవంతమైన బండి సంజయ్ ప్రతి గ్రామంలో.. ప్రతి గడప వరకు తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలను వివరించి సక్సెస్ అయ్యారు. పాదయాత్రలో భాగంగా… ప్రజల కష్టాలను తెలుసుకుని, వారికి మేమున్నామనే భరోసా కల్పించడంలోనూ… సక్సెస్ అయిన బండి సంజయ్ బూటకపు వాగ్దానాలతో ప్రజలను కేసీఆర్ ఎలా మోసం చేశాడో… కళ్ళకు కట్టినట్టు చెప్పడంలోనూ సఫలీకృతమయ్యారు. ‘బీఆర్ఎస్’ ఒక వైరస్… ‘బిజెపి’ ఒక వ్యాక్సిన్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్ పాదయాత్రలతో… తెలంగాణ బిజెపిలో ఫుల్ జోష్ నింపిన బండి సంజయ్ రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న బీజేపీ క్యాడర్ ను రోడ్డెక్కించి, ప్రజా సమస్యలపై పోరాటం చేయించడంలోనూ సక్సెస్ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.