కేంద్రం లో సర్కారును కాపాడుకోడానికే బండి బలి..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కిషన్ రెడ్డికి బీజేపీలోనే కాదు ఇతర పార్టీలోని నేతలతోనూ మంచి సత్సంబంధాలు ఉండటంతో రేపొద్దున బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలన్నా ఆ పరిచయాలు పనికొస్తాయని భావించిన హైకమాండ్ కిషన్ రెడ్డికి పార్టీ అద్యక్షపదవిని కట్టబెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాకుండా  ప్రజలను నమ్మించడానికి తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్నిఏర్పాటుచేస్తామని బిజెపి నేతలు చెబుతున్నరేపు తెలంగాణాలో బిఅర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు కు ఇంటర్నల్  గా  సపోర్ట్ చేసి కేంద్రంలో బిజెపి పార్టీ ఏర్పాటుకు   బిఆర్ఎస్ మద్దతు కూడ గాట్టుకోడానికి పన్నిన కుట్రలో బాగమే బండి సంజయ్ ని పార్టీ అద్యక్షపదవి నుండి తొలిగింపు అని పరిశీలకులు బావిస్తున్నారు.మితబాషి ,సౌమ్యుడు గా గుర్తింపు పొందిన కిషన్ రెడ్డి ద్వారానే ఈ పని జరుగుతుందని బావించిన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌ అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. పైగా ఎప్పుడూ బీజేపీ అన్నా.. మోదీ అన్నా ఒంటికాలిపై లేచే సీఎం కేసీఆర్ ఈ మధ్య అస్సలు కాషాయ పార్టీని పట్టించుకున్న దాఖలాల్లేవ్. పైగా చిన్నపాటి విమర్శ చేసిన సందర్భం కూడా లేదు. మంత్రులుబీఆర్ఎస్ నేతలు కూడా కేంద్రం మీకు రాష్ట్రం మాకు అనీ కేసీఆర్‌ ఫార్ములాను  ఫాలో అవుతున్నారు. కేంద్రం లోని బిజెపి సర్కారును కాపాడుకోడానికే బండి సంజయ్ బాలి కావలసు వచ్చిందన్న వాదనలు వినబడుతున్నాయి. బండి మార్పును అటు రఘ్జునదన్ రావు, విజయ శాంతి లు బాహటంగా వ్యతిరేకించారు.ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బాగా బలపడుతోంది.. ఆ పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అయితే కాంగ్రెస్‌ను ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకూడదని బీజేపీబీఆర్ఎస్ భావిస్తున్నాయని ఆ మధ్య జాతీయస్థాయి నేత ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారని వార్తలొచ్చాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్‌తో మంచి సంబంధాలుండే కిషన్ రెడ్డి నియమించి ఉంటారని కూడా టాక్ నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమిలోకి బీఆర్ఎస్ చేరే ఛాన్స్ ఉందని అందుకే.. కేసీఆర్‌‌తో సత్సంబంధాలున్న కిషన్ రెడ్డి అయితే అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటారని బీజేపీ అగ్రనాయకత్వం భావించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా.. బీజేపీ-బీఆర్ఎస్ కలిసి అడుగులు ముందుకేస్తాయనే సంకేతాలు ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటనతో కాస్త లీకులు వచ్చాయి. ఆయన ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు.. రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలుఆర్ఎస్ఎస్ బండి మార్పుపై ససేమీరా అన్నప్పటికీ మోదీషా ఈ నిర్ణయం తీసేసుకున్నారట. అంతేకాదు.. ఇవన్నీ ఒకఎత్తయితే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానా కారణాలు కనిపిస్తున్నాయి. . ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఉన్న పరిస్థితులను గట్టెక్కించడానికి కిషన్ రెడ్డి అయితేనే కరెక్ట్ అని.. గేమ్ ఛేంజర్‌ అని బీజేపీ నాయకత్వం గట్టిగా నమ్ముతోంది. బండి తర్వాత కిషన్ ఏ మాత్రం పార్టీని బలోపేతం చేస్తారు..? పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలేంటి..? అనేవి తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.