జూలై మాసంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు సైతం ఉంటాయి. వ్యాపారస్తులు, స్వయం ఉపాధి పొందేవారు, స్వశక్తి సంఘాల వారు అంటూ ఇలా చాలా మంది తరుచుగా బ్యాంకులకు వెళ్తుంటారు. వారందరూ బ్యాంకుల పని వేళలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే చివరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వచ్చే జులై, 2024 నెలలో బ్యాంకులు ఏకంగా 12 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. జాతీయ, ప్రాంతీయ సెలవులు, పండగలు శని, ఆదివారాలు వంటివి ఉంటాయి. అయితే బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ డిజిటల్ లావాదేవీలు ఉపయోగించుకుని ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటివి అందుబాటులో ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.