అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం

-   గత రెండు రోజుల్లో రెండు బ్యాంకులు మూసివేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం నెలకొంది. గత రెండు రోజుల్లో రెండు బ్యాంకులు మునిగిపోయాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన తర్వాత ఇప్పుడు అమెరికా సిగ్నేచర్ బ్యాంక్ కూడా దివాళా తీసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. దాదాపు 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిసి ఉన్న సిగ్నేచర్ బ్యాంక్ ను ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది.క్రిప్టో కరెన్సీతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్ మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఇలా కీలక బ్యాంకులు మూతపడడంతో బ్యాంకింగ్ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

అమెరికాలో ఆర్థిక సంక్షోభం సమయంలో కుప్పకూలడం ఇది రెండవ అతిపెద్ద షట్ డౌన్. అమెరికా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంక్షోభం 2008 సంవత్సరం వచ్చింది.  ఆ సంవత్సరం బ్యాంకింగ్ సంస్థ లెమాన్ బ్రదర్స్ దివాలా తీసింది. దీని తర్వాత అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిగిపోయింది. అయితే ప్రస్తుతం అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో మూడో అతిపెద్ద వైఫల్యం ఇదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
అమెరికాలో రెండు బ్యాంకులు మూతపడగా.. అమెరికా మార్కెట్లు ఊపందుకున్నాయి. డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉందని.. వారు తమ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలుంటుందని అమెరికా ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సిగ్నేచర్ బ్యాంక్ లలో ఏం జరిగింది.. ఈ రెండు బ్యాంకులు ఎలా మూసివేయబడ్డాయన్ని ప్రశ్నార్థకంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.