ఇక బ్యాంకులు పనిచేసేది 5 రోజులు మాత్రమే

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారతీయ బ్యాంకులు త్వరలో వారానికి 5 రోజులే పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA) ప్రతిపాదనలు పంపినట్లు ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఇదే సమయంలో బ్యాంక్ ఉద్యోగులు అంతా.. 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని ప్రతిపాదించారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్‌తో (UFBI) ఐబీఏ జులై 28న సమావేశం కానుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగుల పనిదినాలను కూడా ఇటీవల వారానికి 5 రోజులుగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.దీంతో ఎల్‌ఐసీ బాటలోనే బ్యాంకులకు కూడా ఇదే విధానం అమలు చేయాలని .. ఈ నెల 19న నిర్వహించిన సమావేశంలో కోరింది UBFA. దీంతో పాటే బ్యాంక్ ఉద్యోగుల వేతనాల పెంపు.. పదవీ విరమణ చేసిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ వంటి తదితర అంశాలపై కూడా చర్చించి.. IBA దృష్టికి తీసుకెళ్లింది.గంటలో రూ. 564 కోట్లు కోల్పోయిన బ్రిటన్ ప్రధాని భార్య అక్షతా మూర్తి.. అసలు కారణం ఇదే?లక్షకు రెండు లక్షలు.. 5 లక్షలకు 10 లక్షలు.. ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే లాభం..ఈ అంశాలపై వచ్చే వారం ఇరు వర్గాలు చర్చించనున్నాయి. ప్రధానంగా వీటిల్లో బ్యాంక్ పనిదినాలపైనే దృష్టి సారించనున్నట్లు సమాచారం. బ్యాంక్ వర్కింగ్ డేస్‌ను వారానికి 5 రోజులుగా చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈ క్రమంలో IBA కూడా తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.అయితే వారంలో ఇప్పుడు ఒక పని రోజు తగ్గుతుండగా.. బదులుగా మిగతా 5 రోజుల పాటు సిబ్బంది పనివేళల్ని రోజూ 40 నిమిషాల పాటు పెంచాలని భావిస్తోంది ఐబీఏ. బ్యాంక్ వర్కింగ్ డేస్‌ను 5 రోజులకు పరిమితం చేయలని బ్యాంకింగ్ యూనియన్స్ ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌గా ఉంది. తాజాగా ఈ విధానాన్ని ఎల్‌ఐసీకి తీసుకురావడంతో మరోసారి బ్యాంక్ పనిదినాల అంశం కూడా తెరపైకి వచ్చింది.హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం.. గజం రూ. 25 వేలకే.. ఆరోజు కోసం ఎదురుచూపులు!ఇంట్లో ఎన్ని డబ్బులు ఉంచుకోవచ్చు.. బ్యాంక్ అకౌంట్‌లో ఎంత వరకు డిపాజిట్ చేయొచ్చు

Leave A Reply

Your email address will not be published.