వరి సాగులో తెలంగాణ కు బాన్సువాడ ఆదర్శం

.. సభాపతి పోచారం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ బీర్కూర్ : తెలంగాణ లోనే ముందస్తు గా బాన్సువాడ నియోజకవర్గం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం బీర్కూర్ సహకార సంఘం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం లో లక్ష ఎకరాల్లో వరి పంట సాగు అయిందని, 3.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు సిద్దం గా ఉండాలన్నారు. రైతులే బ్యాంక్ లకు అప్పులు ఇచ్చే పరిస్థితి రావలనేది సీఎం కెసిఆర్ లక్ష్యం అని అన్నారు. రాష్ట్రం లో వరి పంట ఎక్కువ గా సాగు అయ్యేది బాన్సువాడ నియోజకవర్గం లోనే అన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 30.20 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 2022 వరకల్లా 1కోటి50లక్షల టన్నులు వరి దిగుబడి పెరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సాగు విస్తీర్ణం భారీ గా పెరిగిందన్నారు. యాసంగి లో వరిసాగు కు నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో సమృద్ది గా నీళ్ళు ఉన్నాయని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులు దృష్టి పెట్టాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.