బీసీ బడ్జెట్ 20వేల కోట్లకు పెంచాలి

-  ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో బీసీ నేతలు చర్చలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీల బడ్జెట్ ను 20వేల కోట్లకు పెంచాలని జాతీయ బిసి సంఘం నాయకులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో నేడు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావుతో చర్చలు జరిపారు. బీసీలకు కేటాయించిన బడ్జెటు కేవలం 2శాతం లోపుగా యుంది.  52 శాతం జనాభా గల బీసీలకు కనీసం 10% బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ ప్రతినిధి వర్గంలో లాల్ కృష్ణ, సి. రాజేందర్, తదితరులు ఉన్నారు.

ఈ క్రింది పద్దుల బడ్జెట్ పెంచాలని కోరారు :

బడ్జెట్లో బిసి కార్పొరేషన్ కు సబ్సిడీ రుణాల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి..M.B.C కార్పొరేషన్ కు 2 వేల కోట్లు కేటాయించాలని, బి.సి కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో 2 వేల కోట్లు కేటాయించాలని,ఇంజనీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  ఎస్.టి/ఎస్.సి/మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బిసి/ఇబిసి విద్యార్థులకు కూడా  పూర్తి ఫీజులు  మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు. అలాగే పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు,  స్కాలర్ షిప్స్ ను పెంచడానికి ఈ పథకం కింద బడ్జెట్ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1500 నుంచి 2,500, పాఠశాల హాస్టళ్లకు – గురుకుల పాఠశాల విద్యార్థుల ఆహారపు చార్జీలు 8 నుంచి 10వ తరగతి వారికి రూ.1100/- నుంచి రూ.2000/- కు 3వ తరగతి నుంచి 7 తరగతి వారికి రూ.950 రూపాయల నుంచి రూ.1600 కు పెంచాలని కోరారు.విదేశ విద్య స్టైఫండ్ స్కీమ్ క్రింద  అర్హులందరికీ స్టై ఫండు ఇవ్వడానికి దీని బడ్జెట్ 60 కోట్ల నుంచి 300 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాము.బి.సి అడ్వకేట్లకు ఇచ్చే స్టై ఫండ్ నెలకు రూ.1000 నుంచి 10 వేలకు పెంచాలని కోరారు.   అలాగే ఐ.ఐ.టీ – ఐ.ఐ.ఎం – ఎన్.ఐ.టి తదితర కోర్సులకు కూడా పూర్తి ఫీజులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఫీజులు కట్టలేక చాలామంది బిసిల సీట్లు వదులు కుంటున్నారన్నారు.  ఈ సంవత్సరంలో అదనంగా ప్రతి అసెంబ్లీ  నియోజకవర్గo కు ఒక బి.సి గురుకుల పాటశాలలు మంజూరు చేయాలని,10.        బి.సి స్టడీ సర్కిల్ కు 200 కోట్లు కేటాయించాలి. కోచింగ్ పద్దతులు మార్చాలి. అర్హులందరికీ DSC, పొలీస్, SI, గ్రూప్-1,2,3,4 సివిల్స్, బ్యాంకింగ్, రైల్వే ఇతర పోటి పరిక్షలకు కోచింగ్ ఇవ్వాలని కోరారు.బి.సి కాలేజి హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మని నెలకు 500 మంజూరు చేయాలి. SC విద్యార్థులకు ఇస్తు బి.సి విద్యార్థులకు ఇవ్వకపోవడం న్యాయమన్నారు.    కులాంతర వివాహాలు చేసుకొనే బి.సి కులాల వారికి ప్రోత్సాహక పారితోషికం 2 లక్షల 50 వేలకు పెంచాలి. SC/St/లకు పెంచారు. కాని బి.సి లకు పెంచలేదని,       290 బీసీగురుకుల పాఠశాలలు అన్నీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. భవనాలు, సరైన వసతి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశించిన  విద్యా ప్రమాణాలు – లక్ష్యాలు నెరవేరడం లేదు.కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులు ఈ పద్దు క్రింద భవనాల నిర్మాణo కోసం ఇస్తుంది.  కావున దశలవారీగా గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణం చేయడానికి రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం క్రింద 400 కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు.        రాష్ట్రంలో 290 కాలేజీ హాస్టళ్ళు కొనసాగుతున్నాయి. అన్ని కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాలకు ఏటా కోట్ల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 80 శాతం మ్యాచింగ్  గ్రాంట్ ఇస్తుంది.  రాష్ట్ర  ప్రభుత్వం 20 శాతం మ్యాచింగ్ గ్రాంటు క్రింద దశలవారీగా సొంత భవనాలు నిర్మించడానికి ఈ బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు.

బడ్జెటు పెంచుతామని హామీ :

        బిసిల బడ్జెటును పెద్దయెత్తున పెంచుతామని ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు హామీ వారు తెలిపారు. ముఖ్యమంత్రితో మాట్లాడి బిసి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.