బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ. 500 పాకెట్ మని మంజూరు చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ మేరకు బి.సి సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి బుర్ర వెంకటేశాన్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ. 500 పాకెట్ మని మంజూరు చేసిన విషయాన్నీ ప్రిన్సిపాల్ సెక్రెటరి దృష్టికి తెచ్చారు. అలాగే బీసీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు కూడా మంజూరు చేయాలని కోరారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఎస్సీ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నెలకు 500 రూపాయలు పాకెట్ మని ఖర్చులకోసం ఇస్తున్నారు. కానీ బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు మంజూరు చేయడం లేదన్నారు.మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ హాస్టల్ విద్యార్థులకు కామన్ గా అన్ని సౌకర్యాలు-సదుపాయాలు మెస్ చార్జీలు ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మూడు సామాజిక వర్గాలకు ఇతర అన్ని సౌకర్యాలు ముఖ్యంగా మెస్ చార్జీలుఆహార పట్టికభోజన సౌకర్యాలులైబ్రరీ సౌకర్యాలు అన్ని ఒకే విధంగా ఉన్నవి . కానీ పాకెట్ మనీ ఇవ్వడం లేదు. ఇక్కడ తేడా వివక్ష  స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీసీ కాలేజీ విద్యార్థులకు కూడా పాకెట్ మనీ ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రతినెలా బస్ పాస్ – సబ్బులునునెల-కాస్మోటిక్ ఖర్చులుఇతర ఖర్చులు పెద్ద ఎత్తున ఉంటాయి. పైగా ఒక సామాజిక వర్గానికి ఇచ్చి మరొక సామాజిక వర్గానికి ఇవ్వకపోతే విద్యార్థులలో  ఆత్మన్యూనతా భావం మరియు ద్వేషా భావం ఏర్పడుతుంది. చాల మంది బీద విద్యార్థులు ఖర్చులకు డబ్బులు లేక  క్యాటరింగ్ లకు వెళుతున్నారు. దీనితో చదువు దెబ్బతింటుందని పేర్కొన్నారు.కావున మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ హాస్టళ్ళకు కు ఒకే విధంగా ఉండే విధంగా బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు కూడా నెలకు 500 రూపాయలు పాకెట్ మని  మంజూరు చేయాలని అన్నారు. ప్రిన్సిపాల్ సెక్రెటరిని కలిసిన వారిలో నీల వెంకటేష్ ,రాజేందర్,నికిల్,దీపిక తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.