ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల నాయకత్వాన్ని అపహాస్యం చేయడం సిగ్గు చేటు  

తీవ్రంగా ఖండించిన  బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: బీసీల రాజకీయ పోరాటం మొదలైంది.. అందుకనే అనివార్యంగా అన్ని పార్టీలు బీసీల జపం చేస్తున్నాయని,ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల నాయకత్వాన్ని అపహాస్యం చేయడం సిగ్గు చేటని,  బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తీవ్రంగా ఖండించారు.సోమవారం బాగ్లింగం పల్లిలోని సమితి రాష్ట్ర కార్యాలయం లో మాట్లాడుతూ  నియోజకవర్గాల వారీగా బీసీల జనాభా శాతాన్ని బీసీ రాజ్యాధికార సమితి బయట పెట్టడం కేసీఆర్ కు రుచించడం లేదు.. అందుకే మా మీద అబాండాలు..మేము మా జనాభా శాతం ఇంత అని ప్రసంగాలు నర్కడం లేదన్నారు. మా అవకాశాలను దోపిడీ చేస్తున్న పార్టీలను మా ఓట్లతో రాజకీయంగా నరికే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే 2014 లోనే చేపట్టినప్పటికీ బీసీల జనాభాను ఎందుకు ఈ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు .. తెలంగాణ  రాష్ట్రంలో కులగణన ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. బీసీలను పథకాలకు పరిమితం చేసే కాలం పోయింది.. బీసీలకు రాజకీయవాటా రాజ్యాధికారం దక్కాల్సిందే నన్నారు. తెలంగాణ ఒక్కరోజులో ఏర్పాటు కాలే అలానే బీసీల రాజ్యం కూడా ఎంతో దూరంలో లేదు ఈ విషయాన్ని కేసిఆర్ గమనించాలన్నారు. బీసీల నాయకత్వాన్ని అవమానపరిస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు భంగపాటు తప్పదన్నారు. బలమైన బీసీ ప్రాతినిధ్య స్థానాల్లో ప్రభుత్వానికి బీసీ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.