మాణిక్ రావు ఠాక్రే తో బీసీ సంఘాల భేటీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ స్థానాల కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భైరి రవి కృష్ణ తో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లను కేటాయించాలని కోరారు. అలాగే కర్ణాటక రాష్ట్రం తరాలు ఇక్కడ కూడా బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇవ్వాలని, ఉదంపూర్ డిక్లరేషన్ కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ఉమ్మడి జిల్లాను యూనిట్ గా తీసుకొని బీసీలకు 50 శాతం టికెట్ కేటాయించాలని, బీసీల్లోని అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కలిసి వినతి పత్రం సమర్పించారు. మాణిక్రావు ఠాక్రే ను కలిసిన వారి లోతాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు, గొడుగు మహేష్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రావుల కోల్ నరేశ్ ప్రజాపతి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వరికుప్పల మధు బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,నర్సింహా నాయక్ ఎస్సి ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు, గణగాని నాగరాజు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి,బీసీ సంఘం నాయకులు గుంటి మహేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.