బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై బిసి సంఘాల ఆగ్రహం

- ఓట్లు మావి సీట్లు మీవా .. బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను మార్చాలి -  ఈనెల 24 న రాష్ట్ర వ్యాప్తంగా అంబేత్కర్,పూలే విగ్రహాల వద్ద  నిరసనలు, ధర్నాలు  -   26 న బిసి సంఘాల నేతలతో ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక - బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బిసి లక్కు జరిగిన అన్యాయం పై ఈనెల 24 న రాష్ట్ర వ్యాప్తంగా అంబేత్కర్,పూలే విగ్రహాల  వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు.  బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో 62 శాతం ఉన్న బిసిలకు 23 సీట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కెసిఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను సవరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు బిసి కులాల నాయకులతో కలిసి మాట్లాడుతూ బీసీలలో 136 కులాలు ఉంటే కేవలం 5 కులాలకు టికెట్లు ఇచ్చారని, మిగిలిన 131 కులాలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీలో 80 మంది బీసీలు బలమైన అభ్యర్థులు ఉన్నారు. అరశాతం లేని రెడ్లకు 40 టికెట్లు కేటాయించారని, రెడ్లకు కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదని, బిసి ద్రోహుల పార్టీ అన్నారు. ఈటెల ను బర్తరఫ్ చేసిన మంత్రి స్థానాన్ని మరో రెడ్డికి కేటాయించేందుకు చూస్తున్నారని అన్నారు. పథకాలు అణగారిన వర్గాలకు, పదవులు అగ్రకులాలకు ఇస్తున్నారని మండిపడ్డారు. మహిళ బిల్లు కావాలని ఢిల్లీలో ధర్నా చేసిన కవితకు  రాష్ట్రంలో 7 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారని బిఆర్ఎస్ జాబితాలో ఒక్క బిసి మహిళ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 24 న రాష్ట్ర వ్యాప్తంగా పూలే, అంబెడ్కర్ ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 26 న బిఆర్ఎస్ పార్టీలో మోసపోయిన అభ్యర్థులతో హైదరాబాద్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. 60 మంది అగ్రకులాలకు కేటాయించిన అభ్యర్థులను ఎలా ఓడించాలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు దారితీస్తున్నారని అన్నారు. బీసీలు బిఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 9 శాతం జనాభా ఉన్న అగ్రకులలకు 54 శాతం ప్రధాన్యత ఇచ్చారని, ఇదేనా సామాజిక న్యాయం? బిఆర్ఎస్ అంటే భారత రెడ్ల రాజ్య సమితిగా మారిందన్నారు. 60 శాతం ఉన్న బిసిలకు 20 శాతం టికెట్లు ఇచ్చి అన్యాయం చేశారని అన్నారు. అమెరికాలో ఉండి ట్విట్లు చేస్తున్న కేటీఆర్ అమెరికాను చూసి బుద్ది తెచ్చుకోవాలన్నారు. అక్కడ రెండు సార్లు మాత్రమే పోటీ చేస్తారని అన్నారు. సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వడం పాత చింతకాయ్ పచ్చడి అని అన్నారు. రెడ్లకు ప్రధాన్యత ఇవ్వాలని కెసిఆర్ ఇతర పార్టీలలు హింట్ ఇచ్చారని అన్నారు. బీద రెడ్లకు టికెట్ ఇవ్వకుండా, వందలా కోట్లు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారన్నారు.బి ఫార్మ్ ఇచ్చేటప్పుడు అగ్రకులకు, లేదా కవితకు ఇవ్వడానికి కామారెడ్డి టికెట్ కెసిఆర్ రిజర్వ్ చేసి పెట్టికున్నాడని అన్నారు. బిఆర్ఎస్ ఉన్నది రెడ్లు కోసమా? సామాజిక న్యాయం అని చెప్పుకోవడానికి అర్హత లేదన్నారు. బిఆర్ఎస్ నాయకులను ఎక్కడి కక్కడ నిలాదీయాలని అన్నారు. ఆత్మ గౌరవం ఉన్న బీసీలు తిరుగుబాటుకు సిద్ధం కావలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిసి సంఘ నాయకులు కులకచర్ల శ్రీనివాస్, దుర్గయ్య గౌడ్, కానకల శ్యామ్, గొడుగు మహేష్ యాదవ్, నాగరాజు గౌడ్, మధు, సింగం నాగేష్, శ్యామల, కుందారం గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.