“బీసీల బంధు” పథకాన్ని ప్రవేశపెట్టి పదిలక్షల రూపాయలు ఇవ్వాలి

-బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగిడాల సుదాకర్ డిమాండ్-

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి పదివేల కోట్లు కేటాయించాలని,  10 వేల కోట్లలో బీసీల సబ్-ప్లాన్ ను ప్రవేశపెట్టి,బీసీల బంధు” పథకాన్ని ప్రవేశపెట్టి పదిలక్షల రూపాయలు ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగిడాల సుదాకర్ డిమాండ్ చేసారు.ముఖ్యమంత్రి గారు గత 15 నెలల క్రితం నెలలో బిసి బంధు” పథకాన్ని ప్రవేశ పెడతామని హామీ ఇచ్చారు. హామీ ఇచిన విషయాన్ని ఈ సందర్బంగా సుదాకర్ ముదిరాజ్ గుర్తు చేసారు.అలాగే బడ్జెట్లో బిసి కార్పొరేషన్ కు సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, 5 సంవత్సరాల క్రితం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు  చేసుకోగా 40 వేల మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చారు. మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నవి. వీరికి సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఈ బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేసారు.M.B.C కార్పొరేషన్ కు 2 లకోట్లు కేటాయించాలని,12 బి.సి కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో 4 వేల కోట్లు కేటాయించాలని సుదాకర్ ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.