రాజకీయ నిర్మాణంతోనే అధికారంలోకి బీసీలు..ఆ దిశగా అడుగులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీలు తాము బలమైన ఓటు బ్యాంకు గా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి, కార్పొరేటర్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పర్సన్, ఎమ్మెల్యే, ఎంపీ తదితర స్థానాలలో పోటీకి సిద్ధమయ్యేలా, తమ రాజకీయ ప్రాతినిధ్య స్థానాలను తామే కైవసం చేసుకునేలా బలమైన క్షేత్ర స్థాయి నిర్మాణాన్ని చేపడుతున్నామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ తెలిపారు..అందుకు అనుగుణంగా తెలంగాణఉద్యమంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ దొంత ఆనందం గారిని గౌరవ అధ్యక్షులుగా, సామాజిక ఉద్యమాలలో అలుపెరుగని కార్యక్రమాలను నిర్వహించిన సుతారి లచ్చన్నను సంస్థ ప్రధాన కార్యదర్శిగా మరియు సీనియర్ బీసీ ఉద్యోగ సంఘాల ,కుల సంఘాల నాయకుడు గడప కోటేష్ కుమార్ ను రాష్ట్ర సెక్రటరీ గా ముఖ్య నాయకుల సమక్షంలో నియామక పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. నియామక పత్రాలు స్వీకరించిన నాయకులు బీసీలను రాజ్యాధికారం వైపు పయనింపజేసేలా శక్తి వంచన లేకుండా పని చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్. మల్లేశం,ప్రసాద్ యాదవ్,మీస కొమురయ్య, కడారి ఐలయ్య,బండి మల్లయ్య యాదవ్,మేకల శ్రీకాంత్ , కొండ రవీందర్,కట్ట రమేష్ , అడెపు దినేష్,చిగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.