బీసీల కుల గణన చట్టసభల్లో రిజర్వేషన్లపై  పై ఏప్రిల్ 3న చలో ఢిల్లీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా అధ్యక్షుడు జబ్బల శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో ఏప్రిల్ మూడో తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం జాతీయస్థాయిలో బీసీల కులగణన కోసం బీసీ ఉద్యోగుల ప్రమోషన్ లో రిజర్వేషన్ కోసం కేంద్రంలో ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖ కోసం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద పెద్ద ఎత్తున జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పెద్ద ఎత్తున బిసి సంఘాల ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జ్ కర్రీ వేణుమాధవ్ తెలియజేశారు . బీసీల మరియు కుల సంఘాల చట్టసభలో రిజర్వేషన్లు బీసీ నాయకుల పాత్ర పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణు మాధవ్  పాల్గొని బీసీ నాయకులకు దిశా నిర్దేశం  చేశారు దేశంలో ఎన్నికల సంవత్సరం కాకపోయినా ఎన్నికల మూడు ఈ సంవత్సరమే వచ్చేసిందని ప్రతి పార్టీ కూడా బీసీల అవసరాన్ని గుర్తించే పరిస్థితికి బీసీ ఉద్యమం ఎదిగిందని ఈ సందర్భంగా నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్ రావు గారు  హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపేష్ సాగర్ గారు శుభ ప్రదు పాల్గొన్నారు  సందర్భానికి తగ్గట్టుగా ఉద్యమ పందాన్ని మార్చాల్సిన అవసరం ఉందని కర్రి వేణుమాధవ్ నాయకులకు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.