భగవత్ గీత ను మానవులు అనునిత్యం పఠించాలి ఆచరణలో పెట్టాలి

.. బ్రహ్మర్షి తటపర్తి వీర రాఘవరావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్స్ వాడ ప్రతినిధి: మానవులు అందరూ భగవద్గీతగీతను అనునిత్యం పఠించాలి పఠనంతో పాటు ఆచరణలో పెట్టి నప్పుడు మానవ జన్మ సార్ధకం అవుతుందని పరమాత్మ తత్వం అలవడాలంటే శ్వాస మీద ద్యాస పెడుతూ ధ్యానం చేసి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని సాధన చేస్తే సాధ్యం అవుతుందని తటపర్తి వీరరాఘవరావు అన్నారు. శుక్రవారం పిరమిడ్ స్పీర్చువల్ సోసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఉచిత ధ్యాన శిక్షణ శిబిరం బాన్స్ వాడ ఆధ్వర్యంలో సరస్వతీ మందిర ఆలయ వేదిక లో ఏర్పాటు చేసిన ధ్యాన శిబిరం లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ధ్యానులకు మార్గనిర్ధేశం చేశారు.జీవహింస చేయడం మానాలని ప్రతీ జీవిలో పరమాత్మ తత్వాన్ని చూసినప్పుడే మానవ జన్మ సార్ధకం అవుతుందని అన్నారు. మానవునిలోని జీవశక్తి పరమాత్మలో లీనమైతే మానవుల జీవనం సార్ధకత అవుతుందని సూచించారు. శాఖాహారం అమృతాహారమని మాంసాహారం మానివేసి శాఖాహారులుగా మారాలని ఉద్భోధించారు.జీవహింస ద్వారా మానవుడు సుఖశాంతులు ఉండవని, మనిషి జీవ హింసను మాని సుఖశాంతులతో జీవించాలని అన్నారు. మంచి కర్మలు చేయాలని భగవంతుడు సృష్టి కర్త ధర్మ సిద్ధాంతం ప్రకారం నడుచుకొంటాడని, కానీ మానవుడు ఈ సిద్ధాంతాలను మరిచి చేయరని కర్మలు చేసి కష్టాల పాలవుతున్నడని అన్నారు. మంచి కర్మలు చేస్తూ భగవత్ సంకల్పం పొందాలని ధర్మాన్ని నిలబెట్టాలన్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకొంటారు, కానీ దేవుడు ప్రతీ జీవిలో పరమాత్మ రూపంలో కొలువై ఉన్నాడని మానవుడు గ్రహించాలన్నారు.మనిషి ఇంద్రియాలను స్వాధీన పరుచుకొని సమస్త ప్రాణుల యెడల హితకారిగా ఆసక్తి కలవారై ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. మనసు అనేది అంతేంద్రియమని ఇంద్రియనిగ్రహంతో అన్ని జీవులలో ప్రాణం ఉందని అన్ని జీవులపట్ల సమభావంతో మెలగాలని అన్ని జీవులకు ప్రాణం ఒకటేననే భావం తో మెలగాలన్నారు.పరభ్రహ్మ పరమాత్మ గురించి ఎవరు చెప్పలేరని పరమాత్మను చేరుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేసినపుడే పరమాత్మ తత్వాన్ని ఆ పరంధాముని చేరుకోవచ్చన్నారు. ప్రతీ ఒక్కరూ'” ధర్మో రక్షతి: రక్షితః ” ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుందని, రక్షకుడిగా భగవంతుడున్నారని ధ్యానులకు సూచించారు.మనిషి ధ్యానంలో పరమాత్మను దర్శించాలని ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ధ్యానిస్తే భగవంతుని దర్శిస్తే భూమి మీద ఉన్నవారు మరణించకముందే భగవంతుని దర్శించుకోవాలంటే ధ్యానంచేయడం ద్వారా సాధ్యమైనంత వరకు సాధన చేయాలన్నారు. చనిపోయిన వారు పైలోకాల్లో కర్మనుసారంగా ఆరు లోకాలను చేరు కొంటారని అవి(1) ఊర్ధ్వ లోకం, (2)ధ్యాన లోకం, (3)జనలోకం, (4)తపోలోకం, (5)సత్యలోకం, (6)మహాలోకం ఈ ఆరు లోకాలు ఉన్నాయని మనిషి తన కర్మానుసారంగా చేసిన ధర్మ, పాప కర్మాను సారంగా లోకాలను చేరుకొని కర్మలను అనుభవించాలని అన్నారు. మనిషి సంపాదించుకున్నది ఏమి లేదని సమస్తం పరమాత్మ తత్వమేనని ఆయన లేనిదీ ఏదీ లేదని ఆయన అంతటా వ్యాపించి ఉన్నారని ఆయనను ధ్యానిస్తే నే మోక్ష ప్రాప్తి లభిస్తుందన్నారు. ధ్యాన శిక్షణ శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేయాలంటే భీమవరం లో ప్రతీ నెల 1, 2, 3,తేదీల్లో వర్కషాప్ పెడతామని మూడు రోజులపాటు ఉదయం, సాయంత్రం, 1గంటపాటు ధ్యానం, సత్సంగం చేయిస్తూ అన్ని సదుపాయాలను భోజనం ఉచితంగా కల్పిస్తూన్నామని అన్నారు. ఈ ఒక్కరోజు శిబిరంలో మీరు నేర్చుకొన్న దాని కంటే ఎక్కువ గా మీరు ధ్యానం లో పాల్గొని పరమాత్మను అంతరంగంలో సాధించుకోవాలని ప్రతీ రోజు శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేయాలనీ పత్రీజీ ఆశయాలు అందరికి పంచాలని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా ఆర్డీఓ రాజాగౌడ్, ఆలయ దర్మకర్త శంభురెడ్డి, అంజిరెడ్డి, పిరమిడ్ ధ్యాన కేంద్ర స్థాపకులు బెజుగం శంకర్ గురు స్వామి, అధ్యక్షులు హన్మాండ్లు, అంజయ్య సభ్యులు, పట్టణంలోని ధ్యాణులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.