తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి దినోత్సవ సంబురాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి దినోత్సవ సంబురాలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంట ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరారవు, సంతోష్‌ కుమార్‌, మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఉన్నారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ జరుగుతున్నది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్ధేశం చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.