పింగళి వెంకయ్య కు భారతరత్న ఇవ్వాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలని పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు జగదాంబ డిమాండ్ చేశారు. బుదవారం పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మారక సభలో పింగళి వెంకయ్య గారికి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షురాలు జగదాంబ మాట్లాడుతూ పింగళి వెంకయ్య జయంతిని వంద సంవత్సరాలు పూర్తి చేసిన ఘనత తమ ట్రస్ట్ కే చెందుతుందని తెలిపారు జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవం అయిన 1921 సంవత్సరంమార్చ్ 31 నుండి ఏప్రిల్ రెండు వరకు ప్రభుత్వం  అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని ఆమె కోరారు అంతేకాకుండా దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క ట్రస్టు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు సహాయపడాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు ట్రస్ట్ చైర్మన్ జగదాంబ గారిని ఫోన్లో పరామర్శించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా మీడియా కన్వీనర్ ఐజాక్ రాజ్ మరియు బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు ట్రస్టు సభ్యులు సీతారత్నం నాదెళ్ల అన్నపూర్ణ శ్యామలరావు  మేఘన శ్రీకాంత్ అనుదీప్ సాయికిరణ్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.