మహానాడు వేదికగా బిగ్ పొలిటికల్ బ్లాస్టింగ్…?

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: తెలుగుదేశం  పార్టీ ప్రతీ ఏటా మహానాడు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గత ఏడాది ఒంగోలులో మహానాడు నిర్వహించి పార్టీకి ఊపు తెచ్చింది. ఈసారి గోదావరి జిల్లాల ముఖ ద్వారం అయిన రాజమండ్రీలో మహానాడు నిర్వహించాలని చూస్తోంది. ఈ నెల  27 28 తేదీలలో జరిగే ఈ మహానాడులో రాజకీయ సంచలనాలు అనేకం ఉంటాయని తెలుస్తోంది.మహానాడు తరువాత ఎన్నికలకు వెళ్లడమే జరుగుతుంది కాబట్టి ఇది పార్టీకి చాలా అవసరంగా చెబుతున్నారు. మహానాడు లో రాజకీయ తీర్మానాలు అన్నీ కూడా అదే విధంగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈసారి మహానాడులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేయబోతోంది అన్న దాని మీద కూడా ప్రజలకు బాబు తెలియచేస్తారని అంటున్నారు.చంద్రబాబు ముగింపు ప్రసంగంలో అనేక హైలెట్స్ ఉండేలా చూస్తున్నారు. అదే విధంగా మహానాడులో పొత్తుల విషయం కూడా చంద్రబాబు ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఒక విధంగా ఏపీలో గత ఏడాదిగా కొనసాగుతున్న పొత్తుల ఎత్తులు అనేక చర్చకు సందేహాలకు ఒక ముగింపు ఇచ్చేలా కీలక సందేశం ఇస్తారని అంటున్నారు.ఇక వీటన్నిటికంటే రాజకీయంగా వైసీపీని దెబ్బ తీసే విధంగా బాబు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి మహానాడులో వైసీపీ నుంచి భారీ చేరికలకు ప్లాన్ వేస్తున్నారు  ఇప్పటికే వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. అదే సమయంలో మరికొందరు వైసీపీలో అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.ఇలా ఉన్న వారిని టీడీపీ ఐడెంటిఫై చేసిందట. వారితో సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇలా పార్టీ వైపు వచ్చిన వారిని చేర్చుకోవాలని కూడా వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఇక నెల్లూరు జిల్లా నుంచి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు రోజుల క్రితం రాజమండ్రీ వచ్చి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు.అంతే కాదు ఆయన ఒక అరగంటకు పైగా స్థానిక ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ విషయం  సంచలనంగా మారింది. ఈ సందర్భంగా కోటం రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కానీ జనసేన కానీ టికెట్ ఇస్తామని హామీ ఇస్తే మాత్రం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని. మరి కోటం రెడ్డి ఊరికే ఆ మాటలు అన్నారా లేక రాజకీయంగా వీటికి ప్రాధాన్యత ఉందా అన్న దాని మీద కూడా అంతా చర్చిస్తున్నారు.మరో వైపు చూస్తే టీడీపీ ఎక్కువగా నెల్లూరు ప్రకాశం జిల్లాల మీద ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో నెల్లూరులో పదికి పది సీట్లను వైసీపీ సాధించింది. ఇక ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లకు గానూ ఎనిమిదింటిని గెలుచుకుని వైసీపీ జెండా ఎగరవేసింది. అలాంటి చోట ఇపుడు వైసీపీలో లుకలుకలు కనిపిస్తునాయి.అవి ఎక్కడా ఆగడంలేదు. దాంతోనే ఇపుడు టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. వైసీపీ నేతలు వేసుకుంటున్న అంచనాలు చంద్రబాబు రాజకీయ చాణక్యం కనుక వర్కౌట్ అయితే ఎవరూ ఊహించని ముఖాలే మహానాడు వేదిక మీద వైసీపీ నుంచి కనిపిస్తాయని. అలా తెలుగుదేశంలో చేరికలకు మంచి ఊపు వస్తుందని తేవాలని తమ్ముళ్ళు ఆరాటపడుతున్నారు.ఏది ఏమైనా ఈసారి మహానాడుతో ఏపీ రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారు. దానికి తగినట్లుగా ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంటున్నారు మరి చంద్రబాబు రాజకీయం సక్సెస్ అవుతుందా. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన వారితో పాటు కొత్త వారు ఎవరైనా టీడీపీ వైపు అడుగులు వేస్తారా అన్నది తెలియాలంటే ఈ నెల 27 వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.