తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని నేషనల్ జెన్ కోఆర్డినేటర్ మధ్యప్రదేశ్ ఓ బి సి ఇన్చార్జి ఉల్లెంగుల యాదగిరి అన్నారు.హనుమకొండ లోని బాలసముద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఉల్లెంగుల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణలో 56% ఉన్న బిసిలకు పిసిసి లో అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇదే పునరావతం జరిగితే 2023లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి దూరమాయే అవకాశం ఉంటుందని హెచ్వ్హ్హరించారు. కాబట్టి అధిష్టానం ఢిల్లీ పెద్దలు త్వరగా ఈ విషయాన్ని పరిశీలించి బిసిలకు న్యాయం చేయాలని లేని ఎడల కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరం అయితారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పీసీసీ సెక్రెటరీ మీసాల ప్రకాష్,  స్టేట్ కోఆర్డినేటర్ ఓబిసి టిపిసిసి బండారి జనార్దన్ గౌడ్, గణేష్ గౌడ్, స్టేట్ కోఆర్డినేటర్ ఓబిసి టి పి సి సి పార్టీ నాయకులు కుంచన రవీందర్, జంగం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.