వైసిపి మాజీ ఎమ్మెల్యే కు బిగ్ షాక్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వైసీపీ   మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన బెయిల్‌ పిటిషన్లు కొట్టేసింది. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు పిన్నెల్లి. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం సహా పిన్నెల్లి పై మూడు కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటికి వరకు ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ పిన్నెల్లి బయట ఉన్నారు.

ఇటీవల మొత్తం నాలుగు కేసుల్లో మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఆ నాలుగు పిటిషన్లను కొట్టేసింది. కాగా పిన్నెల్లి ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈరోజు లేదా రేపు పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం. మరోసారి పారిపోకుండా పిన్నెల్లిపై పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.