అత్యాచార దోషులను విడుదల చేయడాన్ని సుప్రీంలో బిల్కిస్‌ బానో సవాల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2002 గోద్రా అల్లర్లలో తనపై సామూహిక సవాల్ చేస్తూ బిల్కిస్‌ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యాచారానికి పాల్పడిన 11 మందిని దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్‌ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దోషులను విడుదల చేసేందుకు 1992 నాటి రెమిషన్ నిబంధనలను విర్తింపజేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు 13న ఉత్తర్వులను పునః సమీక్షించాలని బిల్కిస్‌ బానో కోరారు.బిల్కిస్‌ బానో తరఫు న్యాయవాది పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఇంతకు ముందు దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారించవచ్చాఒకే బెంచ్‌ ముందు విచారించవచ్చాఅనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బిల్కిస్‌ బానో కేసులో ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంతకు ముందు అక్టోబర్‌ 21న నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌’ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇప్పటికే విచారణ జరుపుతున్నది. మహిళా సంస్థ తరఫున ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులో దోషులకు శిక్ష తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిన్‌ బానో వయసు 21 సంవత్సరాలు.అప్పటికే ఐదు నెలల గర్భవతి కాగా.. అల్లర్ల సమయంలో పారిపోతున్న సమయంలో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం జరుగడంతో పాటు ఆమె కుటుంబంలోని ఏడుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో బిల్కిస్‌ బానో మూడేళ్ల కూతురు సైతం ఉన్నది. ఈ కేసులో 11 మంది నిందితులకు జీవితఖైదు ఖరారు కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న నిందితులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది.అంతకు ముందు గోద్రా సబ్‌ జైలులో నిందితులు 15 సంవత్సరాలకుపైగా శిక్ష అనుభవించారు. అయితేబిల్కిస్‌ బానో కేసు నిందితులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.