3వ తేదీ వరకు బిట్రగుంట – చెన్నై- తిరుపతి – కడప రైళ్లు రద్దు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విజయవాడ డివిజన్‌లో చేపడుతున్న రమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.- నెం.17237 బిట్రగుంట – చెన్నై సెంట్రల్‌, నెం.17238 చెన్నై సెంట్రల్‌ – బిట్రగుంట రైళ్లు ఈ నెల 30 నుంచి నవంబరు 3వ తేది వరకు రద్దు.

– నెం.07659 తిరుపతి – కాట్పాడి, నెం.07682 కాట్పాడి – తిరుపతి(Katpadi – Tirupati) స్పెషల్‌ రైళ్లు ఈ నెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు రద్దు.

– నెం.06417 కాట్పాడి – జోలార్‌పేట, నెం.06418 జోలార్‌పేట – కాట్పాడి మెమో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు రద్దు.

– నెం.06401 అరక్కోణం – కడప, నెం.06402 కడప – అరక్కోణం మెమో స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు రద్దు.

పాక్షిక రద్దు…

– నెం.16854 విల్లుపురం – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు కాట్పాడి వరకు మాత్రమే నడువనుంది. అలాగే, నెం.16853 తిరుపతి – విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి నుంచి బయల్దేరుతుంది.

Leave A Reply

Your email address will not be published.