టిఆర్ఎస్ లో చేరిన చండూరు మున్సిపాలిటీ లోని బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

.. గులాబీ కండువాలు క‌ప్పి, టిఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి ఎర్ర‌బెల్లి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలోని అంతంపేట గ్రామ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సమక్షంలో టీఆరెఎస్ లో చేరారు. వాళ్లకు గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలోనే టిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు. ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కెసిఆర్ అనుభవంతో కూడిన దిశా నిర్దేశం, యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ లీడర్షిప్ ఉన్న పార్టీ అని చెప్పారు. భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమి లేదన్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. టిఆర్ఎస్ లో చేరిన వారిలో చండూరు మున్సిపాలిటీలో ని బీజేపీ నుండి ఎస్. కే ఖాసిం, ఎస్ కే సయ్యద్, కాంగ్రెస్ నుండి ఎస్ కే చంద్, ఎస్ కే జాని, అవుల స్వామి, ఎస్ కే చిన్న సయ్యద్, ఎస్ కే నాగూర్ వలీ, చొప్పరి యాదయ్య, ఈద వెంకటేశం మరియు 50 మంది కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.