బీజేపీ అంతర్గత సర్వే160 సీట్లలో గడ్డుకాలం

- స్వయంగా రంగంలోకి మోడీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో వరుసగా రెండోసారి 2019లో అధికారం అందుకున్న బీజేపీకి ప్రస్తుతం ఆ పరిస్దితి కనిపించడంలేదు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిస్దితులు కాషాయ దళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం వినిపించిన ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నేతలు ఇప్పుడు ఆ మాట అనేందుకు ధైర్యం చేయడం లేదు. దీంతో వాస్తవ పరిస్దితి తెలుసుకునేందుకు బీజేపీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీ కనీసం 160 ఎంపీ సీట్లలో ప్రతికూల పరిస్ధితులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ ఆఫీస్ బేరర్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ 160 సీట్లలో తాజా పరిస్ధితిపై చర్చించారు. డిసెంబర్ 21న జరిగిన ఆఫీస్ బేరర్ల భేటీలో సమీక్ష నిర్వహించిన బీజేపీ కీలక నేతలు… ఎల్లుండి మరోమారు భేటీ ఈ సీట్లపై చర్చించబోతున్నారు. ఈ మొత్తం 160 సీట్లలో 100 సీట్లపై డిసెంబర్ 21న సమీక్షించిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎల్లుండి ప్రధాని మోడీ సమక్షంలోనే మరో 60 సీట్లపై సమీక్షకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో ఎల్లుండి ఈ సమీక్ష జరగనుంది. 

ముఖ్యంగా బీహార్, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో బీజేపీ ఈ 160 సీట్లలో ప్రతికూల పరిస్ధితులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో బీజేపీ, జేడీయూ బంధం విడిపోయాక మారిన పరిస్ధితుల్లో గతంలో ఉన్న నాలుగు సీట్ల ప్రతికూలత కాస్తా 10కి పెరిగినట్లు తెలుస్తోంది. ఇందులో నవాడా, వైశాలి, వాల్మీకి నగర్, కిషన్‌గంజ్, కతిహార్, సుపాల్, ముంగేర్, ఝంజర్‌పూర్, గయా, పూర్నియా వంటి సీట్లు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన షిండే వర్గం అధికారంలో ఉన్నప్పటికీ గతంలో మహా వికాస్ అఘాడీ కూటమితో పొత్తు విడిపోయిన నేపథ్యంలో పలుచోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ ఎంపీ సీట్లు ఎక్కువగా కోల్పోవచ్చన్న ప్రచారం సాగుతోంది. అలాగే మహారాష్ట్రలో 11, బీహార్ 10, ఉత్తరప్రదేశ్ 10, అస్సాం 5, తెలంగాణ ఐదు, పంజాబ్ మూడు స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. త్రిపుర, డామన్ మరియు డయ్యూ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలోనూ వీటిలో ఒక్కొక్కటి ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.