మర్రి చెన్నారెడ్డికి భాజపా ఘన నివాళులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కీర్తిశేషులు మర్రి చెన్నారెడ్డి జయంతిని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ముఖ్యంగా హైదరాబాద్ లో వేల కోట్ల రూపాయల విలువైన నిజాం అక్రమ ఆస్తులను, స్థలాలను ప్రజా ప్రయోజనాల కోసం మార్చే విషయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనుకంజ వేయకుండా నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన ధైర్యశీలి మర్రి చెన్నారెడ్డి. కేబీఆర్ పార్క్, కింగ్ కోఠి ఆసుపత్రి, మలక్ పేట గంజ్ ఏర్పాటు పేరుతో విస్త్రత ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారంటే….నాడు మర్రి చెన్నారెడ్డి తీసుకున్న నిర్ణయాలవల్లే అన్నారు.

ఆనాడు మతకల్లోల పేరుతో చెన్నారెడ్డి సీఎం పదవి నుండి దించేందుకు ఎంఐఎం నేతలు హైదరాబాద్ లో మతం పేరుతో అల్లర్లు స్రుషించినప్పటికీ ఒవైసీ కుళ్లు రాజకీయాలకు లొంగకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నారని, మర్రి చెన్నారెడ్డి అత్యంత క్రమశిక్షణ కలిగిన నేత. మంచి పరిపాలనాదక్షుడు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మూడు రాష్ట్రాలకు గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి, దేశానికి సేవలందించిన నాయకుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మర్రి శశిధర్ రెడ్డి నిరాడంబరతకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారు. అవినీతి మచ్చ లేని నాయకుడు. జాతీయ విపత్తుల నివారణ కమిటీ సభ్యుడిగా మర్రి శశిధర్ రెడ్డి అందించిన సేవలు మరువలేనివి. తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివ్రుద్దికి మరింతగా పాటుపడాలని కోరుకుంటున్నా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.